టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో శ్రీచరణి నంబర్ వన్.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్
- మహిళల టీ20 ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
- బౌలింగ్ విభాగంలో శ్రీచరణికి అగ్రస్థానం
- టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో టాప్ ర్యాంకు
- మూడు మ్యాచ్‌లలోనే 10 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్
- అభినందనలు తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేశ్
భారత మహిళా క్రికెటర్ శ్రీచరణిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ టీ20 బౌలింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతేడాది చరణిని కలిసినప్పటి సంగతులు గుర్తుచేసుకున్న లోకేశ్, ఆమె పడిన కష్టాల నుంచి ప్రపంచస్థాయికి ఎదగడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతిభ, పట్టుదల, కఠోర శ్రమకు ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి చరణి విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీచరణిని చూసి ఆంధ్రప్రదేశ్ గర్విస్తోందని, భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 21 ఏళ్ల శ్రీచరణి తొలిసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆమె, ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. కేవలం మూడు మ్యాచ్‌లలోనే 10 వికెట్లు పడగొట్టింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం ఆమె ర్యాంకు మెరుగుపడటానికి దోహదపడింది.
ఈ క్రమంలో ఇంగ్లండ్‌కు చెందిన లిన్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి చరణి అగ్రస్థానానికి చేరగా, మరో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ రెండో స్థానానికి ఎగబాకింది. కేవలం ఏడాది క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన చరణి, అతి తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇదే ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన జార్జియా వోల్, ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ క్రీడాకారిణి హేలీ మాథ్యూస్ తమ అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు.